16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకండి.. ఆత్మగౌరవంతో ఓటేయండి: సీఎం చంద్రబాబు

Writer: Chandrika 05:53 AM, 16 ఆగస్టు, 2026
ఎన్నికల్లో డబ్బులు తీసుకోకండి.. ఆత్మగౌరవంతో ఓటేయండి: సీఎం చంద్రబాబు

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఆత్మగౌరవంతో ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బు వారి సొంత సొమ్ము కాదని, అవినీతి మార్గాల్లో సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని మాత్రమే ఓటర్లకు ఇస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. నగదు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, మహిళల్లో దీనిపై చైతన్యం పెరగాలని అన్నారు. కుటుంబ సభ్యులు వ్యసనాల బారినపడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

సంకల్పబలం ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చంద్రబాబు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఏపీజే అబ్దుల్‌ కలాం, ఎన్టీఆర్‌, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయట ప్రపంచాన్ని చూసే అవకాశం లభించిందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం, గ్రామం, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని, 2047 నాటికి ఆర్థిక అసమానతలను తొలగించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ లక్షల కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ విధానంతో స్థానిక ఉత్పత్తులను దేశ, విదేశీ మార్కెట్లకు తీసుకెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీ కీలక సందేశం..

స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీ కీలక సందేశం..

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్స్త్రీశక్తి పథకంఎన్నికలుఓటుకు నోటుమహిళా సాధికారతఏపీ రాజకీయాలుఆర్టీసీడ్వాక్రా సంఘాలుఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..

వాస్తు చిట్కాలు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేయకూడదా?

వాస్తు చిట్కాలు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేయకూడదా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..
జనరల్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...
జనరల్

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..
జనరల్

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!
జనరల్

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీ కీలక సందేశం..
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీ కీలక సందేశం..

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..
జనరల్

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..

వాస్తు చిట్కాలు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేయకూడదా?
జనరల్

వాస్తు చిట్కాలు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేయకూడదా?

ఓనం 2026: మహాబలి రాజు ,వామన అవతారం వెనుక ఆసక్తికర పురాణ గాథ ఇదే..
జనరల్

ఓనం 2026: మహాబలి రాజు ,వామన అవతారం వెనుక ఆసక్తికర పురాణ గాథ ఇదే..

గాలెలో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

గాలెలో టీమ్‌ఇండియా జోరు..

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకండి.. ఆత్మగౌరవంతో ఓటేయండి: సీఎం చంద్రబాబు
జనరల్

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకండి.. ఆత్మగౌరవంతో ఓటేయండి: సీఎం చంద్రబాబు