
జనరల్

ఆకాశ వీక్షకులకు ఆగస్టు 12న అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేయనుంది. పాక్షిక సూర్యగ్రహణం అనంతరం ప్రసిద్ధ పెర్సీడ్స్ (Perseids) ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకుని రాత్రి ఆకాశాన్ని మెరిపించనుంది. ఈ సందర్భంగా గంటకు అనేక ఉల్కలు ఆకాశంలో దూసుకెళ్తూ కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఉత్తర అమెరికాలోని నార్త్ కరోలినా నుంచి అలాస్కా వరకు ఈ ఖగోళ విన్యాసం అత్యంత స్పష్టంగా కనిపించే అవకాశముందని నిపుణులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ ప్రాంతాల్లో గంటకు డజన్ల కొద్దీ ఉల్కలు కనిపిస్తూ ఆకాశ వీక్షకులకు అద్భుత అనుభూతిని కలిగించనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!