
జనరల్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, అధికారులు ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని, ఉద్యోగులు సాఫ్ట్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.
ఉద్యోగులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని, పాలనా సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సాంకేతికతతో పరిపాలన మరింత సులభమైందని, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలు మారాలని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!