

టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన మానవత్వాన్ని చాటుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రమేశ్‌కు అండగా నిలిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్షల ఆర్థిక సాయం అందించారు. రమేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైతే భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తానని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. రాహుల్ చేసిన ఈ సహాయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గబ్బర్ సింగ్' చిత్రంలోని అంత్యాక్షరి కామెడీ సన్నివేశం ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు రమేశ్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 'అత్తారింటికి దారేది'తో పాటు పలు తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య పాత్రల్లో నటించిన రమేశ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!