
జనరల్

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మెటా సంస్థ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోషల్ మీడియా అల్గారిథమ్‌లు, కంటెంట్ మోడరేషన్, వినియోగదారుల భద్రత, భారత చట్టాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మెటా ప్రతినిధులు తమ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న కొన్ని లోపాలను అంగీకరించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా భారత చట్టాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (సీఎస్ఏఎం), డీప్‌ఫేక్‌లు వంటి హానికరమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని మెటా ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు వెల్లడైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!