

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ క్రీడను గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తొలి అడుగుగా విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఓపెన్ ట్రయల్స్, అండర్-21 ఆటగాళ్ల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ క్రీడా, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి హాజరై, బ్లాక్ హాక్స్ చేపడుతున్న క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. రాష్ట్రంలో గ్రాస్‌రూట్ స్థాయిలో వాలీబాల్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రధాన యజమాని అభిషేక్ రెడ్డి కంకనాల మాట్లాడుతూ ప్రతి ఏడాది టాలెంట్ హంట్, జిల్లా మరియు గ్రామీణ స్థాయి టోర్నమెంట్లకు మద్దతు, కోచ్‌లకు అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ప్రొఫెషనల్ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో వాలీబాల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇదే సమయంలో ఎఫ్‌ఐవీబీ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను భారత తొలి ప్రొఫెషనల్ డివిజన్ లీగ్‌గా గుర్తించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!