

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్)లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. టిమ్స్‌లో కొనసాగుతున్న ట్రయల్ రన్, మౌలిక వసతులు, వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలు, వివిధ విభాగాల సిద్ధతపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
టిమ్స్‌ను దేశంలోని అత్యాధునిక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్ సేవలు, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఐటీ వ్యవస్థలు తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, టిమ్స్ అందుబాటులోకి వస్తే నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!