

జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో సోమవారం కేబుల్ కార్ సర్వీసుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు 300 మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. గుల్మార్గ్ గోండోలాలో ప్రయాణిస్తున్న సమయంలో కేబుల్ కార్లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని గంటల పాటు పర్యాటకులు గాల్లోనే నిలిచిపోయిన కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది మరియు సహాయక బృందాలు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించాయి. పర్యాటకులను సురక్షితంగా కిందకు దించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కేబుల్ కార్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, సాంకేతిక లోపానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘటనపై స్పందిస్తూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!