

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయకన్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని 'ఏ' సర్టిఫికెట్ అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. పోస్టర్‌లో "ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి. జోసెఫ్" అనే పవర్‌ఫుల్ లైన్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అయితే సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటంతో గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోతో కుదిరిన ఓటీటీ ఒప్పందం రద్దైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త ఓటీటీ భాగస్వామి కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జూలై 24ను తాత్కాలిక విడుదల తేదీగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!