

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇండియా కూటమి పార్టీలు ఈనెల 30న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నాయి. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ తదితర నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కూటమి తదుపరి కార్యాచరణ, సీఈసీపై తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ఇటీవల పేర్కొంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆ కథనం తెలిపింది. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఈ వాదనను ఖండిస్తూ, ఎస్‌ఐఆర్ సహా అన్ని నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర విచారణ, సీఈసీపై చర్యలు, దేశవ్యాప్తంగా నిరసనలపై ఇండియా కూటమి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!