

తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. యాదాద్రి ప్లాంట్‌లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లు ఉన్నాయి. దీంతో ప్లాంట్ మొత్తం స్థాపిత సామర్థ్యం 4,000 మెగావాట్లుగా ఉంది. యాదాద్రి సామర్థ్యం అందుబాటులోకి రావడంతో TGGENCO విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.
యాదాద్రి ప్లాంట్‌లో దసరాకు ముందే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌కు అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు లభ్యతపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్యలు తీసుకోవాలని సూచించారు. మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు సమీకరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తి సాధించే చర్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!