
బిజినెస్

గ్రామకంఠం భూముల మినహాయింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) స్పష్టత ఇచ్చింది. 2014 డిసెంబర్ 8ను కటాఫ్ తేదీగా నిర్ణయించింది. ఈ తేదీకి ముందే నిర్మాణాలు ఉన్న భూములకు మినహాయింపు వర్తిస్తుందని, కటాఫ్ తేదీ తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లకు మినహాయింపు ఉండదని తెలిపింది. భూ సమీకరణ పథకం నుంచి మొత్తం 6,473.72 ఎకరాలకు మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది.
అపరిష్కృత దరఖాస్తుల పరిష్కారం కోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 685 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. అధికారిక రికార్డులతో పాటు శాటిలైట్ చిత్రాలను ఆధారంగా చేసుకుని పరిశీలన నిర్వహిస్తారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనుంది. అర్హత ఉన్న రైతులకు అన్ని ప్రయోజనాలు అందిస్తామని సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!