

భారీ వర్షాల కారణంగా గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతిలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లకు పెరిగిన నీటి ప్రవాహాలపై కూడా చంద్రబాబు సమీక్షించారు. పెరిగిన నీటి లభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రిజర్వాయర్లతో పాటు చిన్న, మధ్య తరహా నీటి వనరులను నింపాలని అధికారులను ఆదేశించారు. నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ పులిచింతల–ప్రకాశం బ్యారేజీ మధ్య, అలాగే ప్రకాశం బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. హిరమండలం ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేసి, వంశధార నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించే చర్యలను చేపట్టాలని ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!