19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

Writer: Pooja 02:08 PM, 19 ఆగస్టు, 2026
యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) యువతకు మరింత చేరువ కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. యువత బ్యాంకు శాఖలకు వచ్చే వరకు వేచి ఉండకుండా, బ్యాంకులే నేరుగా వారి వద్దకు వెళ్లాలని చెప్పారు. 16 ఏళ్లు పైబడిన యువతను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 2 నుంచి నెల రోజుల పాటు ‘బ్యాంకింగ్ ఫర్ యూత్’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఖాతా ప్రారంభం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు బ్యాంకింగ్ సేవలపై యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.

కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా క్యాంపస్‌లను ఈ ప్రచారానికి ప్రధాన వేదికలుగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. యువతను ఆకర్షించేందుకు 12 పీఎస్‌బీలు తమకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకోవాలని చెప్పారు. యువత కేవలం ఖాతా తెరవడం వరకే పరిమితం కాకుండా, ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపారం, పెట్టుబడులు వంటి జీవితంలోని వివిధ దశల్లో తమ బ్యాంకుతో దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగించేలా సేవలు అందించాలని సూచించారు.

యువతకు ఉచిత ఆన్‌లైన్ విద్యా కంటెంట్‌ను అందించడంతో పాటు, ఫిట్‌నెస్, యోగా వంటి లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు, కూపన్లు, వోచర్లను అందించే అవకాశాలను పరిశీలించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు శాఖల్లో యువ బ్యాంకింగ్ మిత్రలు, యువ కియోస్క్‌లను ఏర్పాటు చేసి రుణాలు, ప్రభుత్వ పథకాలు, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. యువతకు అనువైన బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అవకాశాలపై సమాచారం అందించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

ట్యాగ్లు
బ్యాంకింగ్ ఫర్ యూత్నిర్మలా సీతారామన్ప్రభుత్వరంగ బ్యాంకులుయువత బ్యాంకింగ్ఆర్థిక అవగాహనబ్యాంకింగ్ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!