
టెక్నాలజీ

ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)ను 2003లో నీతా అంబానీ స్థాపించారు. కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు ICSE, IGCSE, CAIE, CISCE వంటి అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందిస్తుంది. 11,12 తరగతులకు IB డిప్లొమా ప్రోగ్రామ్ కూడా ఉంది.
స్కూల్లో 1,087 మంది విద్యార్థులు, 187 మంది ఉపాధ్యాయులు (27 మంది విదేశీయులు) ఉన్నారు. తైమూర్, ఆరాధ్య, అబ్రామ్ వంటి బాలీవుడ్ స్టార్ పిల్లలు ఇక్కడ చదువుతున్నందున ఈ స్కూల్కు పెద్ద పేరుంది.
ఫీజుల విషయానికి వస్తే:
గ్రేడ్ ఆధారంగా ఫీజులు మారుతాయి. కిండర్ గార్టెన్ నుంచి 7వ తరగతి వరకు ఏటా సుమారు ₹1.7 లక్షలు, 8–10 తరగతులు ₹5.9 లక్షలు, 11–12 తరగతులు ₹9.65 లక్షలు. మొత్తం చదువు ఖర్చు గ్రేడ్పై ఆధారపడి సుమారు ₹14 లక్షల నుంచి ₹20 లక్షల వరకు ఉండొచ్చు. యూనిఫాంలు, పుస్తకాలు, రవాణా, సౌకర్యాలు ఫీజులోనే ఉంటాయి.







.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!