

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా "వారణాసి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక జక్కన్న తదుపరి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి ఇప్పటికే సినీ అభిమానుల్లో మొదలైంది. గతంలో అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా ఉండొచ్చనే ప్రచారం జరిగినప్పటికీ, దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.
ఇప్పుడు మరోసారి కొత్త కాంబినేషన్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సౌత్ స్టార్ సూర్యతో రాజమౌళి సినిమా చేసే అవకాశాలపై ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి వీరిద్దరి కలయికపై గతంలో కూడా పలుమార్లు వార్తలు వినిపించాయి. "మగధీర" సమయంలో కూడా సూర్య పేరు పరిశీలనలోకి వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి లేదా సూర్య నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!