

ఆరోగ్యకరమైన జీవనశైలిలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బ్రోకలీ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్ జాతికి చెందిన ఈ కూరగాయలో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం డీఎన్ఏ మార్పులను నియంత్రించి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. దీంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బ్రోకలీ రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణలో కూడా ఉపయోగకరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆర్థరైటిస్ నివారణకు సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజువారీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!