

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం "జన నాయగన్" విడుదలపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ హీరోగా కనిపించనున్న చివరి సినిమాగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. మొదట ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సిన సినిమా అనేక కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. దీంతో సినిమా విడుదల తేదీపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
జూలై 24న సినిమా విడుదల కానుందనే ప్రచారం సాగగా, ఇప్పుడు చిత్ర సహ నిర్మాత, విజయ్ సన్నిహితుడు జగదీష్ పలనిస్వామి కీలక ప్రకటన చేశారు. అభిమానులకు ఒక రోజు ముందుగానే పండుగ తీసుకొస్తూ జూలై 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో విజయ్ అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!