

ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సంస్థల డార్క్ స్టోర్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు టీజీ సేఫ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లేబులింగ్, డిస్‌ప్లే నిబంధనలు పాటించకపోవడంతో పాటు కొన్ని డార్క్ స్టోర్లలో ఎలుకల బెడదను గుర్తించారు. కల్తీ అనుమానంతో 29 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు లైసెన్సులను సస్పెండ్ చేసి, సంబంధిత వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీల్లో భాగంగా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 12 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, 9 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సంస్థల డార్క్ స్టోర్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, లేబులింగ్, నిల్వ విధానాలను పరిశీలించేందుకు టీజీ సేఫ్ నిఘాను కొనసాగిస్తోంది. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!