23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

Writer: Shivani K 10:54 PM, 22 ఆగస్టు, 2026
లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్‌లోని ప్రముఖ అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1921-22లో నివసించిన ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లోని ఈ ఇంటిని సీఎం పరిశీలించారు. ప్రస్తుతం అంబేడ్కర్ ఆశయాలకు అంకితమైన మ్యూజియంగా కొనసాగుతున్న ఈ ప్రదేశంలో రాజ్యాంగబద్ధత, సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, అణచివేత లేని సమాజం, సామాజిక న్యాయం వంటి ఆయన సిద్ధాంతాలను ప్రతిబింబించే అంశాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సందర్శకుల డైరీలో తన అనుభూతిని నమోదు చేస్తూ.. అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించడం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఉందని, సామాజిక న్యాయం కోసం మరింత అంకితభావంతో పనిచేయాలన్న స్ఫూర్తి కలిగిందని పేర్కొన్నారు.

దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేడ్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ చైర్ సంతోష్ దాస్ ఎంబీఈ, యూకేలో అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన పలు విషయాలను ముఖ్యమంత్రికి వివరించారు. పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటని అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని తెలుసుకోవడంతో పాటు ఆయనకు సంబంధించిన వస్తువులను చూడటం, తాకడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

ట్యాగ్లు
సీఎం రేవంత్ రెడ్డిఅంబేడ్కర్ హౌస్డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్లండన్శ్రీధర్ బాబుతెలంగాణ ప్రభుత్వంసామాజిక న్యాయంసమానత్వంఅంబేడ్కర్ మ్యూజియంయూకే పర్యటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!
జనరల్

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?
బిజినెస్

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!
సినిమాలు

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనరల్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!