
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడి భుజానికి తదుపరి చికిత్స కోసం కేరళ చేరుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, తదుపరి చికిత్సలో భాగంగా త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. త్రిస్సూర్ సమీపంలోని ఆయుర్వేద వైద్యశాలలో అందించే థెరపీ ద్వారా భుజానికి మరింత ఉపశమనం, కదలిక మెరుగుదల కలిగేలా చికిత్స కొనసాగించనున్నారు. ఆయన కేరళ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!