

భారత సోలార్ కంపెనీల మాడ్యూల్స్, సెల్స్‌పై అమెరికా 126% సుంకాలు విధించడంతో బుధవారం మార్కెట్లో కలకలం రేగింది. ఉదయం ఉత్సాహంగా సాగిన ట్రేడింగ్‌పై ఈ వార్త ప్రభావం చూపడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది, అమ్మకాలు పెరిగాయి. సెన్సెక్స్ 50.15 పాయింట్ల లాభంతో 82,276.07 వద్ద, నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25,482.5 వద్ద ముగిశాయి. అయితే డే హై నుంచి సెన్సెక్స్ దాదాపు 674 పాయింట్లు కోల్పోయింది. సోలార్ కంపెనీల షేర్లు 5% నుంచి 14% వరకు పడిపోయాయి.
ఇక ఏఐ ప్రభావ భయాలు ఐటీ షేర్లపై తీవ్రంగా పడటంతో ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్‌కు ఆందోళన పెరిగింది. ఈ నెలలో నిఫ్టీ ఐటీ సూచీ 21% పడిపోవడం గత 23 సంవత్సరాల్లో అతిపెద్ద పతనంగా నమోదైంది. దీంతో ఐటీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీకి సుమారు రూ.38,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు రూ.63,000 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నెలలో ప్రధాన ఐటీ కంపెనీల షేర్లు 17% నుంచి 27% వరకు క్షీణించాయి. ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు 380 బిలియన్ డాలర్లకు చేరగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్ర వంటి భారత ఐటీ దిగ్గజాల కలిపిన మార్కెట్ విలువ సుమారు 241 బిలియన్ డాలర్లకు తగ్గింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!