

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సమ్మక్క-సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఈ నేల అన్యాయాన్ని ఎదిరించిన చరిత్ర కలిగి ఉందని సీఎం అన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమై, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలను పరిష్కరించడం, హక్కులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటమని వివరించారు. చరిత్రను మరచిపోకుండా, పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!