

హెరిటేజ్ ఫుడ్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్చితో ముగిసిన నాల్గో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ సమీకృత నికర లాభం 37.26 శాతం తగ్గి రూ.23.94 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.38.16 కోట్లుగా నమోదైంది.
అయితే జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,048.46 కోట్ల నుంచి రూ.1,157.56 కోట్లకు పెరిగింది. అదే సమయంలో మొత్తం వ్యయాలు కూడా రూ.990.59 కోట్ల నుంచి రూ.1,132.40 కోట్లకు పెరిగాయి.
మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 20.26 శాతం తగ్గి రూ.188.28 కోట్ల నుంచి రూ.150.13 కోట్లకు పడిపోయింది. అయితే మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.4,526 కోట్లకు చేరింది. ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల ఆదాయ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. అలాగే రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.50 తుది లాభాంశాన్ని డైరెక్టర్ల మండలి సిఫారసు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!