
జనరల్

డెంగ్యూ నివారణ కోసం రూపొందించిన ‘క్యూడెంగా’ (Qdenga) టీకా మార్కెటింగ్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ (DCGI) ఆమోదం తెలిపినట్లు టకెడా బయోఫార్మా ఇండియా వెల్లడించింది. భారత్‌లో డెంగ్యూ నివారణ కోసం అధికారికంగా ఆమోదం పొందిన తొలి టీకా ఇదే. 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారు ఈ టీకాను తీసుకోవచ్చని సంస్థ తెలిపింది.
2022లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ టీకాకు ఇప్పటికే 43 దేశాల్లో అనుమతులు లభించగా, ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల డోసులు సరఫరా చేసినట్లు టకెడా వెల్లడించింది. అంతర్జాతీయ క్లినికల్ పరిశోధనల ఫలితాల ఆధారంగానే భారత్‌లో కూడా ఆమోదం లభించిందని తెలిపింది. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ వ్యాధి 125 దేశాల్లో ఉండగా, ప్రపంచ కేసుల్లో దాదాపు మూడో వంతు భారత్‌లోనే నమోదవుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!