

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్‌లో తన టూవీలర్ పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించింది. మొత్తం 10 మోడళ్లను పరిచయం చేయగా, వాటిలో ఏడు పూర్తిగా కొత్తవి, మూడు అప్‌డేటెడ్ మోడళ్లు ఉన్నాయి. స్కూటర్లు, రోడ్‌స్టర్లు, క్రూయిజర్లు, అడ్వెంచర్ బైక్‌లతో పాటు ICE, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వీటిని స్థానికంగా తయారు చేసి దశలవారీగా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ADV160 అడ్వెంచర్ స్కూటర్, రెట్రో స్టైల్ CB500, రెబెల్ 300, రెబెల్ 500 క్రూయిజర్లు, XR300L, XR300 ర్యాలీ అడ్వెంచర్ బైక్‌లు ఈ లైనప్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనూ హోండా తన పట్టును పెంచుకునేందుకు QC3 EVని తీసుకొస్తోంది. 3 kWh బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 151 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సుమారు 2.4 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని తెలిపింది. 5 అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్ కీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరోవైపు, ట్రాఫిక్‌లో రైడింగ్‌ను సులభతరం చేసేందుకు హోండా ఇ-క్లచ్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. దీని ద్వారా క్లచ్ లీవర్‌ను ఉపయోగించకుండానే గేర్లు మార్చుకోవచ్చు. క్లచ్ ఆపరేషన్లను సిస్టమ్ ఆటోమేటిక్‌గా నిర్వహిస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!