
క్రీడలు

చమురు దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రత్యామ్నాయ ఇంధన వ్యూహంపై దృష్టి సారించింది. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలపడం ద్వారా ఇంధన భద్రతను పెంచడం, రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యమని కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌లో కలపడం సాధ్యం కాకపోవడంతో, దానిని ఐసోబ్యూటనాల్‌గా మార్చే సాంకేతికతపై ప్రభుత్వం పనిచేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ జీవ ఇంధనం తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడంతో పాటు ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని, రైతులకు అదనపు ఆదాయం కూడా అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!