
సినిమాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) తన ప్రముఖ సెడాన్ కారు డిజైర్ ఉత్పత్తిలో కీలక మైలురాయిని సాధించింది. ఇప్పటివరకు ఈ మోడల్‌కు చెందిన 35 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి ప్రారంభమైన 18 ఏళ్ల 9 నెలల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం. భారత ఆటోమొబైల్ మార్కెట్లో డిజైర్‌కు ఉన్న ఆదరణకు ఈ మైలురాయి నిదర్శనంగా నిలుస్తోంది.
డిజైర్‌తో పాటు మారుతి సుజుకికి చెందిన ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ మోడళ్లు కూడా 35 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటాయి. ఈ మోడళ్లకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణ, దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో కంపెనీకి ఉన్న బలమైన స్థానాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!