

పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధికి మూడు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా మొత్తం రూ.42.5 లక్షల నిధులను విరాళంగా అందించాయి. కోహినూర్ గ్రూపునకు చెందిన ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ అమ్జాద్, ఆయన కుమారుడు నిసార్ ఖాద్రీ కలిసి రూ.25 లక్షల చెక్కును శనివారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు అందజేశారు.
పుజ్జోలానా మెషినరీ ఫ్యాబ్రికేషన్స్ తరఫున సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పాయ్ రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. అలాగే దివ్యశక్తి గ్రూపు తరఫున రవీంద్ర కుమార్ అగర్వాల్ రూ.7.5 లక్షలను డీజీపీకి అందజేశారు. పోలీసు సిబ్బంది సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి, వారి పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ విరాళాలు అందించినట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ నిధులు పాఠశాల అభివృద్ధికి, విద్యా సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!