
షోస్

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణ శాఖ విడుదల చేసే తాజా సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!