

ప్రేమ, నమ్మకద్రోహం, మానసిక వేదన గురించి నటి రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తుండగా, సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెజీనా.. తన వ్యక్తిగత జీవితం, గత ప్రేమబంధం, ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బహిరంగంగా వెల్లడించారు.
తన గత ప్రేమబంధం 2020లో ముగిసిందని రెజీనా తెలిపారు. ఆ సమయంలో తీవ్ర నమ్మకద్రోహానికి గురయ్యానని, దాని వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పారు. ఆ బాధ నుంచి బయటపడే క్రమంలో తీవ్రమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆ అనుభవం తర్వాత కొంతకాలం ప్రేమబంధాలకు దూరంగా ఉండి, తనపై తాను దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలు, నటనపైనే ఉందని రెజీనా స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!