

ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అత్యధిక లాభాలు నమోదు చేసిన ఫైనాన్షియల్ కంపెనీగా అవతరించింది. ఈ త్రైమాసికంలో ఎల్‌ఐసీ రూ.23,420 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధిని సాధించింది. దీంతో Q4లో అత్యధిక లాభాలు సాధించిన ప్రభుత్వరంగ సంస్థగా కూడా ఎల్‌ఐసీ నిలిచింది.
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ రూ.19,684 కోట్లు, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.19,221 కోట్ల నికర లాభంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే వార్షిక ప్రాతిపదికన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఎల్‌ఐసీ కంటే ఎక్కువ లాభాలు నమోదు చేశాయి. మరోవైపు, AGR బకాయిల విషయంలో ప్రభుత్వ ఊరటతో వొడాఫోన్ ఐడియా ఆరేళ్ల తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చి, Q4లో రూ.51,970 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!