

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో జనవరి–మార్చి త్రైమాసికానికి ₹2,537 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, కార్మిక చట్టాల మార్పులు, కార్యకలాపాల్లో అంతరాయాలు వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. 2024–25 ఇదే కాలంలో కంపెనీ ₹3,067.50 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అయితే, ఈ త్రైమాసికంలో ఆదాయం 3 శాతం పెరిగి ₹23,830.70 కోట్లకు చేరింది.
మొత్తం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇండిగో ₹2,393.60 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే కాలంలో ₹7,502.50 కోట్ల లాభం నమోదు చేసింది. విదేశీ మారకపు నష్టాలు ₹8,100 కోట్లు, 2025 డిసెంబరులో విమాన సర్వీసుల్లో అంతరాయాల వల్ల ₹580 కోట్ల ప్రభావం, కొత్త కార్మిక చట్టాల అమలుతో ₹1,200 కోట్ల వ్యయాలు పెరగడం వంటి కారణాలతో లాభదాయకత దెబ్బతిందని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ, సీట్ల సామర్థ్యం 9.5 శాతం పెరిగిందని ఎండీ రాహుల్ భాటియా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!