

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రామాయణ’ చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రాముడు, రావణుడి పాత్రల్లోని అసలైన వైభవాన్ని, వారి శక్తిని అనుభవించాలంటే తప్పనిసరిగా ‘రామాయణ’ చూడాలని సూచించారు. రణ్‌బీర్ కపూర్, యశ్ ఇద్దరూ అద్భుతంగా నటించారని, తమ పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.
‘రామాయణ’ తనకు ఎంతో నచ్చిందని, ఇంతటి అంకితభావంతో పనిచేసే నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని సందీప్ వంగా పేర్కొన్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అంతకుముందు మహేశ్ బాబు కూడా ఈ సినిమాను అభినందించారు. చిన్నప్పటి నుంచి వింటున్న కథలు వెండితెరపై ఇంత అందంగా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందని, రణ్‌బీర్, యశ్, సాయిపల్లవి అద్భుతంగా నటించారని కొనియాడారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సైతం సినిమా నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్‌ను ప్రశంసిస్తూ ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించానని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!