
.webp&w=3840&q=75)
గత ఏడాదిన్నరగా ఒడుదొడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇకపై కోలుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లి తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడటం, షేర్ల ధరలు సహేతుక స్థాయిలో ఉండటం వల్ల రానున్న 12–18 నెలలు మార్కెట్లకు ఆశాజనకంగా ఉండనున్నాయని ఆయన విశ్లేషించారు. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు మళ్లీ భారత మార్కెట్లపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు క్రమంగా పుంజుకునే అవకాశం ఉందన్నారు.
వచ్చే ఏడాది కంపెనీల ఆదాయ వృద్ధి 14–15% వరకు ఉండొచ్చని, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 12–15% వృద్ధి సాధించే అవకాశముందని పేర్కొన్నారు. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు 18–20% వరకు పెరుగుతాయని అంచనా వేశారు. కొత్తతరం మదుపరుల పెరుగుతున్న భాగస్వామ్యం, పెట్టుబడి నిర్ణయాల్లో కృత్రిమ మేధ (ఏఐ) పాత్ర పెరుగుతున్నదని తెలిపారు. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, బీమా రంగాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, ఐటీ, ఫార్మా రంగాల్లో జాగ్రత్తగా ఎంపిక చేయాలని, ముఖ్యంగా ఎస్ఎంఈ ఐపీఓలలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!