

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పొదుపు చర్యలు, అలాగే ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 1,500 పాయింట్లు పతనమై, నిఫ్టీ 24,300 దిగువకు చేరింది.
బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే సుమారు రూ.10 లక్షల కోట్లు క్షీణించి రూ.457 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 1,456 పాయింట్ల నష్టంతో 74,559.24 వద్ద ముగియగా, నిఫ్టీ 436 పాయింట్లు కోల్పోయి 23,379.55 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.63 వద్ద జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టైటాన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!