
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. గతేడాది ఆగస్టులో రాష్ట్రానికి రూ.21,558.09 కోట్ల పన్నుల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదే నెలలో రూ.25,449.80 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో పన్నుల రాబడిలో 18.05 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నికర పన్నుల వసూళ్లలోనూ దాదాపు 18 శాతం వృద్ధి కనిపించింది.
వాణిజ్య పన్నుల శాఖలో చేపడుతున్న సాంకేతిక చర్యలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. పన్నుల పర్యవేక్షణ, చెల్లింపుల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత స్క్రూటినీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపు విధానాన్ని మరింత సరళతరం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!