

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు విస్తరిస్తున్న నేపథ్యంలో, వాటిని నడిపే లోకో పైలట్లపై ఆసక్తి పెరుగుతోంది. భారతీయ రైల్వే వందే భారత్ కోసం నేరుగా లోకో పైలట్లను నియమించదు. అభ్యర్థులు ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ఎంపికై, కొన్ని సంవత్సరాల అనుభవం సంపాదించిన తర్వాత ప్రత్యేక శిక్షణ పూర్తి చేసి వందే భారత్ రైళ్లను నడిపే అవకాశం పొందుతారు.
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రైల్వే నిర్దేశించిన వైద్య పరీక్షలు, ముఖ్యంగా కంటి చూపు పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి.
ఉద్యోగంలో చేరిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్‌కు రూ.19,900 ప్రాథమిక వేతనం లభిస్తుంది. అలవెన్సులతో కలిపి నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం అందుతుంది. అనుభవంతో వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే స్థాయికి చేరుకున్న తర్వాత నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, రన్నింగ్ అలవెన్స్, వైద్య సదుపాయాలు, పెన్షన్, ప్రయాణ రాయితీలు, చెల్లింపు సెలవులు, పదోన్నతి అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!