
క్రీడలు

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,160 పెరిగి రూ. 1,64,730 కి చేరింది. అదే విధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2,900 పెరిగి రూ. 1,51,000 గా నమోదైంది. ఇటీవల రోజులుగా పసిడి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదలతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 5 వేల పెరిగి రూ. 3 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువల్లో మార్పులు, పెట్టుబడిదారుల డిమాండ్ పెరగడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు ప్రాంతానుసారం మారవచ్చు. కొనుగోలు ముందు స్థానిక మార్కెట్ ధరలను పరిశీలించడం మంచిది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!