

ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయిలను తాకిన బంగారం, వెండి ధరలకు ప్రస్తుతం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,740గా ఉండగా, ఈ రోజు అది రూ.1,56,430కి పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే రూ.1,310 మేర తగ్గింది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదేవిధంగా, వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. సోమవారం కిలో వెండి ధర రూ.2,68,000గా ఉండగా, మంగళవారం అది రూ.2,67,900కు చేరింది. అంటే కిలోకు రూ.100 తగ్గుదల నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్: రూ.1,56,430, రూ.1,43,390
విజయవాడ: రూ.1,56,430, రూ.1,43,390
ఢిల్లీ: రూ.1,56,580, రూ.1,43,540
ముంబై: రూ.1,56,430, రూ.1,43,390
వడోదర: రూ. 1,56,480, రూ. 1,43,440
కోల్కతా: రూ.1,56,430, రూ.1,43,390
చెన్నై: రూ.1,57,520, రూ.1,44,390
బెంగళూరు: రూ.1,56,430, రూ.1,43,390
కేరళ: రూ.1,56,430, రూ.1,43,390
పూణే: రూ.1,56,430, రూ.1,43,390
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్: రూ.2,64,900
విజయవాడ: రూ.2,64,900
ఢిల్లీ: రూ.2,67,900
చెన్నై: రూ.2,64,900
కోల్కతా: రూ.2,67,900
కేరళ: రూ.2,64,900
ముంబై: రూ.2,67,900
బెంగళూరు: రూ.2,67,900
వడోదర: రూ.2,67,900
అహ్మదాబాద్: రూ.2,67,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!