
జనరల్

రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి, సుజాత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెకండ్ మ్యారేజ్’. ఈ చిత్రానికి రవి మహాదాస్యం హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వం కూడా వహించారు. తమాడ మీడియా బ్యానర్‌పై రాహుల్ తమాడ, సాయిదీప్ రెడ్డి బొర్రా ఈ సినిమాను నిర్మించారు.
థియేటర్లలో విడుదల కాకుండానే ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికపైకి వచ్చింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ప్రారంభించినట్లు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!