
జనరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు జూలై 6న జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ముక్కుకు గాయపడడంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. జూలై 9న డిశ్చార్జ్ అయిన ఆయనకు వైద్యుల సూచన మేరకు ముక్కుకు శస్త్రచికిత్స అవసరమవడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు.
శస్త్రచికిత్సకు ముందు హిమాన్షు ఒక సందేశం విడుదల చేస్తూ, ఆపరేషన్ విజయవంతంగా పూర్తై త్వరగా కోలుకుంటాననే నమ్మకం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని పేర్కొంటూ, తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ఆయనను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!