

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న జెనరిక్ ‘సెమాగ్లుటైడ్’ ఇంజెక్షన్ త్వరలో కెనడా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధానికి కెనడా ఔషధ నియంత్రణ సంస్థ ‘హెల్త్ కెనడా’ ఆమోదం తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది. జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌కు హెల్త్ కెనడా అనుమతి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. టైప్-2 మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఈ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ‘ఒబెడా’ పేరుతో విడుదల చేసింది.
తమ జెనరిక్ సెమాగ్లుటైడ్ ఔషధానికి హెల్త్ కెనడా నుంచి అనుమతి రావడం ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. క్లిష్టమైన జెనరిక్ ఔషధాల అభివృద్ధిలో తమ నైపుణ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుందని సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ తెలిపారు. ఈ అనుమతి ద్వారా కెనడా ప్రజలకు తక్కువ ధరల్లో ఈ ఔషధం అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. 2 మిల్లీగ్రామ్ మరియు 4 మిల్లీగ్రామ్ పెన్ రూపాల్లో ఈ ఇంజెక్షన్‌ను కెనడా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!