

ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కిలియన్ ఎంబాపె చైనాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఫ్రెంచ్ ఆన్‌లైన్ షోలో పాల్గొన్న అతడిని వ్యాఖ్యాత ‘మీకు ఇష్టమైన మీమ్ ఏది?’ అని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ ఎంబాపె చైనాకు చెందిన మావోను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయన ఓ నియంత అని వ్యాఖ్యానించాడు. ఈ సంభాషణకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ చైనాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంబాపె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరుసటి రోజే అతడు క్షమాపణలు చెబుతూ, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వాటి వల్ల చాలామంది బాధపడ్డారని పేర్కొన్నాడు.
అయితే, క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. డాంగ్‌పెంగ్, మెంగ్నియు, మిల్క్‌గ్రౌండ్ వంటి చైనా కంపెనీలు ఎంబాపెతో తమ భాగస్వామ్యాలను తెంచుకున్నట్లు సమాచారం. జాతీయ సెంటిమెంట్‌ను గౌరవించని వారితో కలిసి పనిచేయలేమని అవి స్పష్టం చేశాయి. మరోవైపు, చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ రియల్ మాడ్రిడ్, స్పానిష్ లా లిగా మ్యాచ్‌ల ప్రసారాల నుంచి వైదొలిగింది. ఎంబాపెకు సంబంధించిన ప్రకటనలను కూడా నిలిపివేసింది. ఎంబాపెతోపాటు రియల్ మాడ్రిడ్, లా లిగా క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రసారాలు తిరిగి ప్రారంభం కాలేదని సమాచారం. దీంతో ఎంబాపెపై వివాదం ఫుట్‌బాల్ ప్రసారాలపైనా ప్రభావం చూపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!