

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా రోహిత్ ఎలిమినేట్ కావడం అనూహ్య పరిణామంగా మారింది. ఇంటి సభ్యుల నిర్ణయంతో అతడికి వ్యతిరేకంగా అత్యధిక ఓట్లు రావడంతో నాగార్జున ఎలిమినేషన్‌ను ప్రకటించారు. బలమైన కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ ఇలా బయటకు వెళ్లడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తనకు దగ్గరగా ఉంటాడని భావించిన రామ్ ప్రసాద్ కూడా వ్యతిరేకంగా ఓటు వేయడం తనను బాధించిందని రోహిత్ చెప్పడం చర్చనీయాంశమైంది.
అయితే రోహిత్ ఎలిమినేషన్ తర్వాత మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకు వెళ్లే సమయంలో కనిపించే సంతకం ప్రక్రియను ఈసారి చూపించలేదు. అలాగే రోహిత్‌కు సంబంధించిన ఫేర్‌వెల్ ఏవీ కూడా ప్రసారం కాలేదు. దీంతో అతడు మళ్లీ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి. రోహిత్ అంగీకరిస్తే రీఎంట్రీకి అవకాశం ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానంగానే చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!