

రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త డిజిటల్ వార్నింగ్ సిస్టమ్‌ను ప్రతిపాదించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే వాహనదారులకు డిజిటల్ హెచ్చరికలు పంపే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ-చలాన్ వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలతో అనుసంధానించనున్నారు. సిగ్నల్ జంపింగ్, అతివేగం, హెల్మెట్ లేదా సీటుబెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి ఉల్లంఘనలు చేసిన వెంటనే నమోదైన మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌కు హెచ్చరిక సందేశాలు పంపబడతాయి.
ఈ ప్రతిపాదనలో డీమెరిట్ పాయింట్ల విధానం కూడా కీలకంగా ఉండనుంది. ఒకే సంవత్సరంలో నిర్ణీత పరిమితికి మించి ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే ఆర్టీఓ నేరుగా జోక్యం చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంటుంది. లైసెన్స్ పునరుద్ధరణకు ముందు డ్రైవింగ్ రీ-టెస్ట్, రోడ్ సేఫ్టీ శిక్షణ తప్పనిసరి చేసే అవకాశం కూడా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!