

ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకటించింది. ఇరాన్ నౌకలను అడ్డుకోవడంతో పాటు అమెరికా సముద్ర దిగ్బంధంలో భాగంగా వ్యవహరిస్తున్నందుకే తమ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయని టెహ్రాన్ పేర్కొంది. దాడుల్లో నౌకలు దెబ్బతిని అక్కడి నుంచి వెనుదిరిగినట్లు ఇరాన్ చెబుతోంది.
అయితే అమెరికా మాత్రం ఇరాన్ వాదనను ఖండిస్తూ.. తమ రెండు నౌకలు పలు క్షిపణి దాడులను విజయవంతంగా తప్పించుకున్నాయని, తమ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అనంతరం అమెరికా మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ కూడా అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లు, అమెరికాతో సంబంధం ఉన్న మూడు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా తమ నౌకలపై దాడులు కొనసాగిస్తే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని IRGC హెచ్చరించింది. ఈ పరిణామాలతో కీలకమైన హర్మూజ్ జలసంధిలో భద్రత, అంతర్జాతీయ నౌకా రవాణాపై ఆందోళనలు పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!