
సినిమాలు

భారత్‌లో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్ల కోసం 7.62x39 ఎంఎం బుల్లెట్లను ఐదేళ్ల పాటు సరఫరా చేసేందుకు అదానీ డిఫెన్స్ సంస్థ ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్‌ఆర్‌పీఎల్)తో ఒప్పందం చేసుకుంది. ఈ బుల్లెట్లను దేశీయంగా కాన్పూర్‌లోని అదానీ డిఫెన్స్ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నారు.
భారత్‌లో ఏకే-203 రైఫిళ్లను తయారు చేయడానికి భారత్, రష్యా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం 2019లో ఐఆర్‌ఆర్‌పీఎల్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా కోర్వాలోని తయారీ కేంద్రంలో ఈ రైఫిళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కేంద్రంలో మొత్తం 6.01 లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!