
సినిమాలు

ఈ20 ఇంధనం (ఎథనాల్ మిశ్రమ పెట్రోల్)పై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. ఈ20 వాడితే వాహన మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తగ్గుదల చాలా స్వల్పమని ఆయన తెలిపారు. వాహనం పరిస్థితి, డ్రైవింగ్ శైలి, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలపై మైలేజ్ ప్రభావం ఆధారపడి ఉంటుందని వివరించారు.
ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని ఖర్చు కంటే తక్కువ ధరలకు విక్రయించడంతో రూ. 74,781 కోట్ల నష్టాలను చవిచూశాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ధరలు తగ్గినా, గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన క్రూడ్‌ను ఇప్పటికీ ప్రాసెస్ చేస్తున్నందున ప్రభావం కొనసాగుతోందని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!