

భీమ జువెల్స్ హైదరాబాద్‌లో తన వ్యాపార విస్తరణను కొనసాగిస్తోంది. తాజాగా కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ ఎదురుగా కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. నగరంలో సంస్థకు ఇది ఐదవ షోరూమ్‌గా నిలిచింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ నటి సంయుక్త మీనన్‌తో పాటు భీమ జువెల్స్ చైర్మన్ బీ. బిందు మాధవ్, ఎండీ అభిషేక్ బిందు మాధవ్, డైరెక్టర్ సరోజినీ బిందు మాధవ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బీ. బిందు మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రూ.400 కోట్ల పెట్టుబడితో మరో నాలుగు షోరూమ్‌లను ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు. కొత్త షోరూమ్‌లో బంగారం, వజ్రాభరణాల విస్తృత శ్రేణితో పాటు వెండి ఆభరణాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!